Chorus
నిన్నే నమ్మినాను యేసయ్య నన్ను విడిచి పోకు యేసయ్య‖ 2x ‖
నా ప్రాణం ధ్యానం జీవం నీవే‖ 2x ‖
నిన్నే చేరినాను యేసయ్య‖ 2x ‖
Verse
కదులుచున్న మేఘములు ప్రేమ జల్లు కురిపించే
ఎండిన నా హృదయములో జీవజలములూరాలని
నా జీవము నీవై నా లోనే ఉండాలని
నీ నోటి మాటలే ఊటలుగా మారాలని
మాట కొరకు చూసా యేసయ్య
మాటలాడా రావా యేసయ్య
నా మాట పాట ఊటలు నీవే
నిన్నే చేరినాను యేసయ్య‖ 2x ‖
Verse
లోకములో సంపదలు నాకెన్ని కలిగినను
ప్రియమైన నీ పొందే కోరుకునే నా హృదయం
నీవే నాకు తరగని ధనము
నిన్నే నేను కోరుకొనుచున్నాను
మనసారా నిన్నే యేసయ్య
నా ప్రాణం కోరే యేసయ్య
నా బలము ధనము ఘనము నీవే
నిన్నే చేరినాను యేసయ్య‖ 2x ‖
Verse
ధగధగమని మిరిసేటి నీ నిత్య రాజ్యములో
నీతోనే కలిసి మెలిసి కలకాలం ఉండాలని
బంగారపు వీధులలో నీతోనే నడవాలని
పొందబోయే బహుమానం కన్నులార చూడాలని
ఆశతోనే చూసా యేసయ్య
ఆశలన్నీ నీవే యేసయ్య
నా ఆశ ధ్యాస శ్వాస నీవే
నిన్నే కోరినాను యేసయ్య‖ 2x ‖