Verse
నిన్నే నమ్ముకుంటిని ఓ దేవా - నన్ను దాటి వెళ్ళకు నా ప్రభువా
నీ కృపయందే నమ్మిక యుంచితి - నా శ్రమనుండి తప్పించుమా
నీ వెలుగు నాపై ఉదయించు దేవా - నీ త్రోవలో నన్ను నడిపించుమయ్యా
Verse
నా తండ్రి పాపములు క్షమియించు - మా - పితరుల దోషము మన్నించుమా‖ 2x ‖
నా అతిక్రమ మొప్పుకొనుచుంటి దేవా‖ 2x ‖
మము క్షమియించి రక్షించుమయ్యా‖ 2x ‖
Verse
ఓదార్చువారికై కనిపెట్టుచుంటిని - ఎవ్వరు లేక ఒంటరినైతిని‖ 2x ‖
నా దుర్గము నీవె యేసయ్యా‖ 2x ‖
నీ దరిచేర్చి ఓదార్చుమయ్యా‖ 2x ‖
Verse
శ్రమల సంకెళ్ళు పెనవేసుకున్నవి - మరణపు రోగమై బాధించుచున్నవి‖ 2x ‖
జీవాధారము నీవే యేసయ్యా‖ 2x ‖
నీ చిత్తమే మాకు జరిగించుమయ్యా‖ 2x ‖