Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Ninne Ninne Nammukunnaanayya

నిన్నే నిన్నే నమ్ముకున్నానయ్య

Ninne Ninne Nammukunnaanayya

Lyricist: P Satish Kumar
Verse
నిన్నే నిన్నే నమ్ముకున్నానయ్య
నన్ను నన్ను వీడిపోబోకయ్యా‖ 2x ‖
నువ్వు లేక నేను బ్రతుకలేనయ్య
నీవుంటే నాకు చాలు యేసయ్య‖ 2x నిన్నే ‖
Verse
కన్నుల్లో కన్నీళ్లు గూడు కట్టినా
కన్నవారే కాదని నన్ను నెట్టినా‖ 2x ‖
కారు చీకటులే నన్ను కమ్మినా
కఠినాత్ములెందరో నన్ను కొట్టినా‖ 2x నిన్నే ‖
Verse
చేయని నేరములంటకట్టినా
చేతకాని వాడనని చీదరించినా‖ 2x ‖
చీకు చింతలు నన్ను చుట్టినా
చెలిమే చితికి నన్ను చేర్చినా‖ 2x నిన్నే ‖

Related Tags

WorshipFaithPrayer