Chorus
యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా
నిన్నే నిన్నే నే కొలుతునయ్యా
నీవే నీవే నా రాజువయ్యా‖ 2x ‖
యేసయ్య యేసయ్య యేసయ్యా‖ యేసయ్యా ‖
Verse
కొండలలో లోయలలో
అడవులలో ఎడారులలో
నన్ను గమనించినావా‖ 2x ‖
నన్ను నడిపించినావా
యేసయ్యా‖ యేసయ్యా ‖
Verse
ఆత్మీయులే నన్ను అవమానించగా
అన్యులు నన్ను అపహసించగా
అండ నీవైతివయ్యా‖ 2x ‖
నా కొండ నీవే యేసయ్యా
యేసయ్యా‖ యేసయ్యా ‖
Verse
మరణఛాయలలో మెరిసిన నీ ప్రేమ
నలిగిన బ్రతుకున కురిసిన నీ కృప
నన్ను బలపరచెనయ్యా‖ 2x ‖
నిన్నే ఘనపరతునయ్యా
యేసయ్యా‖ యేసయ్యా ‖
Verse
వంచెన వంతెన ఒదిగిన భారాన
ఒసగక విసిగిన విసిరె కెరటానా
కలలా కడతేర్చినావా‖ 2x ‖
నీ వలలో నను మోసినావా
యేసయ్యా‖ యేసయ్యా ‖