Verse
యేసయ్యా.. యేసయ్యా.. యేసయ్యా.. యేసయ్యా..
నిన్నే నిన్నే నే కొలుతునయ్యా
నీవే నీవే నా రాజువయ్యా‖ 2x ‖
యేసయ్య యేసయ్య యేసయ్యా…
Verse
కొండలలో లోయలలో
అడవులలో ఎడారులలో‖ 2x ‖
నన్ను గమనించినావా
నన్ను నడిపించినావా‖ 2x యేసయ్యా ‖
Verse
ఆత్మీయులే నన్ను అవమానించగా
అన్యులు నన్ను అపహసించగా‖ 2x ‖
అండ నీవైతివయ్యా
నా.. కొండ నీవే యేసయ్యా‖ 2x యేసయ్యా ‖
Verse
మరణ ఛాయలలో మెరిసిన నీ ప్రేమ
నలిగిన బ్రతుకున కురిసిన నీ కృప‖ 2x ‖
నన్ను బలపరచెనయ్యా
నిన్నే ఘనపరతునయ్యా‖ 2x యేసయ్యా ‖
Verse
వంచెన వంతెన ఒదిగిన భారాన
ఒసగక విసిగిన విసిరె కెరటాన‖ 2x ‖
కలలా కడతేర్చినావా
నీ వలలో నను మోసినావా‖ 2x యేసయ్యా ‖