Verse
నిన్ను చూడగ వచ్చినాడురా దేవ దేవుడు
గొప్ప రక్షణ తెచ్చినాడురా యేసు నాథుడు‖ 2x ‖
లోకమే సంతోషించగా
ప్రేమనే పంచే క్రీస్తుగా
బెత్లెహేమను ఊరిలో కన్యకు పుట్టినాడురా
పొత్తి గుడ్డల మధ్యలో హాయిగా నిద్దరోయెరా‖ నిన్ను ‖
Verse
దేవుని కోపము నుండి
తప్పించే ప్రియ పుత్రుడాయనే‖ 2x ‖
ముట్టుకో ముద్దు పెట్టుకో‖ 2x బెత్లెహేమను ‖
Verse
గుండెలో కొలువైయుండి
దీవించే ధనవంతుడాయనే‖ 2x ‖
ఎత్తుకో బాగా హత్తుకో‖ 2x బెత్లెహేమను ‖
Verse
తోడుగ వెంటే ఉండి
రక్షించే బలవంతుడాయనే‖ 2x ‖
చేరుకో నేడే కోరుకో‖ 2x బెత్లెహేమను ‖