Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Ninnu Kaapaadu Devudu

నిన్ను కాపాడు దేవుడు

Ninnu Kaapaadu Devudu

Lyricist: Kranthi Chepuri
Verse
నిన్ను కాపాడు దేవుడు
కునుకడు నిదురపోడు – నిదురపోడు
వాగ్ధానమిచ్చి మాట తప్పడు
నమ్మదగినవాడు – నమ్మదగినవాడు
భయమేల నీకు – దిగులేల నీకు‖ 2x ‖
ఆదరించు యేసు దేవుడు ఉండగా‖ నిన్ను కాపాడు ‖
Verse
శత్రు బలము నిన్ను చుట్టుముట్టినా
శోధనలలో – నిన్ను నెట్టినా‖ 2x ‖
కోడి తన పిల్లలను కాచునంతగా
కాపాడు దేవుడు నీకు ఉండగా‖ 2x ‖
భయమేల నీకు – దిగులేల నీకు‖ 2x ‖
కాపాడు గొప్ప దేవుడు ఉండగా‖ నిన్ను కాపాడు ‖
Verse
రోగ భారమందు లేవకున్ననూ
వ్యాధులు నిన్ను కృంగదీసినా‖ 2x ‖
చనిపోయిన లాజరును తిరిగి లేపిన
స్వస్థపరచు దేవుడు నీకు ఉండగా‖ 2x ‖
భయమేల నీకు – దిగులేల నీకు‖ 2x ‖
స్వస్థపరచు సత్య దేవుడు ఉండగా‖ నిన్ను కాపాడు ‖

Related Tags

FaithComfortProtection