Verse
నిన్ను కాపాడు దేవుడు
కునుకడు నిదురపోడు – నిదురపోడు
వాగ్ధానమిచ్చి
మాట తప్పడు నమ్మదగినవాడు – నమ్మదగినవాడు
భయమేల నీకు – దిగులేల నీకు‖ 2x ‖
ఆదరించు యేసు దేవుడు ఉండగా‖ నిన్ను కాపాడు ‖
Verse
శత్రు బలము నిన్ను చుట్టుముట్టినా
శోధనలలో – నిన్ను నెట్టినా‖ 2x ‖
కోడి తన పిల్లలను కాచునంతగా
కాపాడు దేవుడు నీకు ఉండగా‖ 2x భయమేల ‖
Verse
రోగ భారమందు లేవకున్ననూ
వ్యాధులు నిన్ను కృంగదీసినా‖ 2x ‖
చనిపోయిన లాజరును తిరిగి లేపిన
స్వస్థపరచు దేవుడు నీకు ఉండగా‖ 2x భయమేల ‖