Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Ninnu Kaapaaduvaadu Kunukadu

నిన్ను కాపాడువాడు కునుకడు

Ninnu Kaapaaduvaadu Kunukadu

Verse
నిన్ను కాపాడువాడు కునుకడు
నిన్ను ప్రేమించు యేసు నిదురపోడెన్నడు‖ 2x ‖
నీ భారము వహియించు యేసు
నీ కొరకై మరణించె చూడు‖ 2x నిన్ను కాపాడు ‖
Verse
పలుకరించే వారు లేక పరితపిస్తున్నా
కనికరించి వారు లేక కుమిలిపోతున్నా‖ 2x ‖
కలతలెన్నో కీడులెన్నో
బ్రతుకు ఆశను అణచివేసినా‖ 2x ‖
ఎడబాయడు యేసు నిన్ను
దరి చేర్చును యేసు నిన్ను‖ 2x నిన్ను కాపాడు ‖
Verse
మనస్సులోన శాంతి కరువై మదనపడుతున్నా
పరుల మాటలు కృంగదీసి బాధపెడుతున్నా‖ 2x ‖
భీతులెన్నో భ్రాoతులెన్నో
సంతసంబును త్రుంచివేసినా‖ 2x ‖
ఎడబాయడు యేసు నిన్ను
దరి చేర్చును యేసు నిన్ను‖ 2x నిన్ను కాపాడు ‖

Related Tags

ComfortJesusProtection