Chorus
నిన్ను నేను విడువను దేవ నీవు నను దీవించు వరకు నిన్ను నమ్మినవారల
నెల్ల నీవు చక్కఁగ దీవించెదవు‖ నిన్ను ‖
Verse
నేను శత్రువునై యుండంగ నీవు నాపై నెనరు జూపి దాన మిచ్చితివి
నా కొరకు దారుఁడౌ నీ ప్రియ పుత్రుని‖ నిన్ను ‖
Verse
త్రోవ దప్పి తిరుగుచుండ దుడుకునైన నన్ను ఁ గాంచి ప్రోవ(గోరి
మదిని నీవు త్రోవను బెట్టితివి నన్ను‖ నిన్ను ‖
Verse
నాఁటనుండి నేఁటి వరకు నాకుఁ గల్గిన శోధనములలో నేటుగా
ననుఁ గాచిన వాఁడవు నీవు గావా, ఓ నా తండ్రి‖ నిన్ను ‖
Verse
ఇంత కాలము నన్నుఁ గాచి యిఁకను నన్ను విడువ వనుచు సంత
సించి మదిని నేను జక్కఁగ నీ దరి జేరితిని‖ నిన్ను ‖
Verse
నీవు గాక యెవరున్నారు నేలపైని ననుఁ గాపాడఁ చేవ లేని నాకు నీవు
చేవ గలుగఁ జేయఁ గలవు‖ నిన్ను ‖
Verse
అడుగు వారి కిచ్చెద నంచు నాన తిచ్చినావు గాన నడిగెద నిను
సాహాయ్యంబు నాత్మమై యున్నట్టి తండ్రి‖ నిన్ను ‖
Verse
నాదు ప్రార్థన లన్నియి నీవు నీదు కృపచే నాలకించి నీదు సరణిని నిల్పి
నన్ను నేర్పు దనరఁగ రక్షించితివి‖ నిన్ను ‖