Verse
నిన్ను పోలిన వారెవరు -మేలు చేయు దేవుడవు
నిన్నే నే నమ్మితినిన్ మా దేవా
నిన్నే నా జీవితమునకు ఆధారము చేసుకుంటిని
నీవు లేని జీవితమంతా వ్యర్థము గా పోవునయ్య‖ 2x ‖
Chorus
ఎల్ష దా-ఆరాధన
ఎలో హిమ్-ఆరాధన
అడోనాయ్-ఆరాధన
యే షువా -ఆరాధన
Verse
కృంగి ఉన్న నన్ను చూచి కన్నీటిని తుడిచితివయ్యా
కంటిపాప వలె కాచి కరుణతో నడిపితివయ్య‖ 2x ఎల్ష దా ఆరాధన ‖
Verse
మరణపు మార్గమందు నడిచిన వేళ యందు
వైద్యునిగా వచ్చి నాకు మరో జన్మ నిచ్చితివయ్యా‖ 2x ఎల్ష దా ఆరాధన ‖