Verse
నిన్ను తలచి నను నేను మరచి
నీ సాక్షిగా ఇల నే బ్రతుకుచుంటిని‖ 2x ‖
యేసయ్యా.. నీ కృప లేక నే బ్రతుకలేను‖ 2x నిను తలచి ‖
జీవము లేని దైవారాధనలో
నిర్జీవ క్రియలతో మృతుడనైతిని‖ 2x ‖
జీవాధిపతివై నా జీవితానికి
నిత్య జీవము నొసగిన యేసయ్యా‖ 2x నిను తలచి ‖
దారే తెలియని కారు చీకటిలో
బ్రతుకే భారమై నలిగిపోతిని‖ 2x ‖
నీతి సూర్యుడా ఎదలో ఉదయించి
బ్రతుకే వెలుగుతో నింపిన యేసయ్యా‖ 2x నిను తలచి ‖
సద్గుణ శీలుడా సుగుణాలు చూచి
హృదిలో నేను మురిసిపోతిని‖ 2x ‖
సుగుణాలు చూచుటకే నీవు
సిలువలో నాకై నలిగిన యేసయ్యా‖ 2x నిను తలచి ‖