Verse
నిన్ను వెంబడించెద
నీ కాడి మోయుదున్
నీదు పాదముల చెంత
నే నేర్చుకొందును‖ 2x ‖
మాదిరి నీవే – నెమ్మది నీవే
దీనుడవు యేసయ్యా‖ 2x నిన్ను ‖
Verse
పాపాంధకారం లో నుండి
రక్షించి వెలిగించితివి‖ 2x ‖
పరిశుద్ధమైన పిలుపుతో
నీ వెంబడి రమ్మంటివి‖ 2x నిన్ను ‖
Verse
లోకాశలన్ని నీ కోసం
నేనింక ఆశించను‖ 2x ‖
లోపంబులేని ప్రేమతో
నీ కోసం జీవింతును‖ 2x నిన్ను ‖
Verse
పవిత్రపరచుకొందును
అర్పించు కొందును‖ 2x ‖
కష్టాలు శ్రమలు రేగినా
నిను వీడిపోనయ్యా‖ 2x నిన్ను ‖
Verse
ప్రేమ సువార్త ప్రకటింప
భారంబు మోపితివి‖ 2x ‖
సత్యమార్గంబు చాటగ
పంపుము నా ప్రభువా‖ 2x నిన్ను ‖