Chorus
నిన్ను విడిచి నీ ప్రేమ మరచి -
నేనెటు పోగలను దేవా
ఎవ్వరు నీ ప్రేమ నాకిల చూపగలరు
నాదేవా నా దేవా నా దేవా (నిన్ను విడిచి)‖ నిన్ను విడిచి ‖
Verse
దారి తొలగి తీరము చేరని ఘోర సుడిగాలిలో
నాయకుడా నా ఆర్త ధ్వని విని
నావను నడిపించినావే - తీరము చూపించినావే
యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా
నేనెటు పోగలను దేవా-ఎవ్వరు నీ ప్రేమ నాకిల చూపగలరు
Verse
శ్రమల పాలైతి సొమ్మసిల్లితి - సిలువకు నే చేరితి
శ్రీకరుడా నా శిలువను మోసి - ఆదరణె చూపినావే
నూతన బలమిచ్చినావే .... యేసయ్యా
నేనెటు పోగలను దేవా - యేసయ్యా నా యేసయ్యా‖ నిన్ను విడిచి ‖
Verse
విరిగి నలిగిన నా హృదయాన నీకే సింహాసనం
శ్రీమంతడా నా షాలెము రాజా
బ్రతికెద నీ కోసమే చావైన లాభమే
నేనెటు పోగలను దేవా - యేసయ్యా నా యేసయ్యా‖ నిన్ను విడిచి ‖