Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Ninu Chere Prathi Kshanam Prabhaathame Naalo

నిను చేరే ప్రతీ క్షణం ప్రభాతమే నాలో

Ninu Chere Prathi Kshanam Prabhaathame Naalo

Lyricist: Joshua Shaik
Verse
నిను చేరే ప్రతీ క్షణం ప్రభాతమే నాలో
స్మరింతునూ నీ నామం నిరంతరం యేసు
నీ పిలుపే నా కోసం – నీ పలుకే ఆధారం
నీకే ఆరాధనా
కన్నుల్లో నీ రూపం – కనిపించే నా దైవం
నిన్ను నే చేరగా
నీ ప్రేమే మాధుర్యం – నడిపించే నా దీపం
నీవు నా తోడుగా
నీ వరమే ఈ స్నేహం – నాతోనే కలకాలం
యేసయ్య నా రక్షకా
వేవేల స్తోత్రాలతో నిన్ను కీర్తింతును
ఆనంద గానాలతో నిన్ను స్తుతియింతును
నీ తలపే నా ధ్యానం – నా మనసే నీ సొంతం
నిన్ను ప్రేమింతును
నీతోనే సహవాసం – నను కోరే అనురాగం
యేసయ్య నా ప్రాణమా
నీతోనే చిరకాలం – సాగాలి నా పయనం
గమ్యమే నీవుగా
నీ ప్రేమే అపురూపం – మన్నించే మమకారం
నీవే నా ప్రేరణ
ఏరీతి నే పాడనూ నీదు ఘన ప్రేమను
యేసయ్య నీ సేవలో నేను తరియింతును

Related Tags

PraiseWorship