Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Ninu Choose Kannulu

నిను చూసే కన్నులు

Ninu Choose Kannulu

Lyricist: P Satish Kumar
Verse
నిను చూసే కన్నులు నాకు ఇమ్మయ్యా
నిను పిలిచే పెదవులు ఇమ్ము యేసయ్యా‖ 2x ‖
నిను చేరే పాదములు నాకు ఇవ్వయ్యా‖ 2x ‖
నీ మాట వినే చెవులు ఇమ్ము యేసయ్యా‖ నిను చూసే ‖
Verse
కన్నీటి ప్రార్థన నాకు నేర్పయ్యా
ఆత్మల సంపద నాకు ఇవ్వయ్యా‖ 2x ‖
నీ కొరకే జీవించే సాక్షిగా మార్చయ్యా
నాలోనే నిను చూపే మదిరినివ్వయ్యా‖ నిను చూసే ‖
Verse
అందరితో సఖ్యత ఇమ్ము యేసయ్యా
మృదువైన మాటతీరు నాకు ఇవ్వయ్యా‖ 2x ‖
కోపతాపములు దూరపరచయ్యా
అందరిని క్షమియించే మనస్సునివ్వయ్యా‖ నిను చూసే ‖

Related Tags

WorshipDevotionalPrayer