Chorus
నిను చూడని క్షణము నీతో నుండని బ్రతుకు
ఊహించలేను నా యేసయ్యా ఓ . . హొ . . హొ. .
నీదు స్వరము వినకనే నేను నిను విడచి తిరిగితి నేను
నాదు బ్రతుకులో సమస్తము కోల్ఫోయితి
Verse
నీ దివ్య ప్రేమను విడచి నీ ఆత్మతోడు త్రోసివేసి
అంధకార త్రోవలో నడచి నీ గాయమే రేపితిని
అయినా అదే ప్రేమ నను చేర్చుకున్న ప్రేమ
నను వీడని కరుణ మరువలేనయ్యా యేసయ్యా
Verse
నన్ను హత్తుకొన్న ప్రేమ నన్ను చేర్చుకున్న ప్రేమ
నీ వెలుగులోనే నిత్యం నే నడిచెదన్
నను విడువకు ప్రియుడా నాకు తోడుగా నడువు
నీ తోనే నా బ్రతుకు సాగింతును యేసయ్యా