Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Ninu Gaaka Mari Denini Ne Premimpaneeyaku

నిను గాక మరి దేనిని నే ప్రేమింపనీయకు

Ninu Gaaka Mari Denini Ne Premimpaneeyaku

Verse
నిను గాక మరి దేనిని – నే ప్రేమింపనీయకు‖ 2x ‖
నీ కృపలో నీ దయలో – నీ మహిమ సన్నిధిలో
నను నిలుపుమో యేసు‖ నిను గాక ‖
Verse
నా తలపులకు అందనిది – నీ సిలువ ప్రేమా
నీ అరచేతిలో నా జీవితం – చెక్కించుకొంటివే
వివరింప తరమా నీ కార్యముల్
ఇహ పరములకు నా ఆధారం – నీవై యుండగా
నా యేసువా – నా యేసువా‖ నిను గాక ‖
Verse
రంగుల వలయాల ఆకర్షణలో – మురిపించే మెరుపులలో
ఆశా నిరాశల కోటలలో నడివీధు ఈ లోకంలో
చుక్కాని నీవే నా దరి నీవే
నా గమ్యము నీ రాజ్యమే – నీ రాజ్యమే
నా యేసువా – నా యేసువా‖ నిను గాక ‖

Related Tags

WorshipDevotionalJesus