Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Ninu Namminacho Siggupadaneeyavu

నిను నమ్మినచో సిగ్గుపడనీయవు

Ninu Namminacho Siggupadaneeyavu

Verse
నిను నమ్మినచో సిగ్గుపడనీయవు
నను నెమ్మదితో నీవే ఉంచెదవు
ఆపత్కాలమున నమ్ముకొనదగిన
Pre-Chorus
యేసూ నీవే ఆధారము
యేసూ నీవే నా ప్రాణము
Verse
తెలివిని నమ్ముకొని తూలి పడ్డాను
బుద్ధి జ్ఞానము నీ దానమని నీ చెంతకు చేరాను
Verse
బలమును నమ్ముకొని భంగపడ్డాను
శక్తిమంతుడా నా కోటవని నీ చెంతకు చేరాను
Verse
ధనమును నమ్ముకొని దగాపడ్డాను
సుఖసంపద నీ దీవెనని నీ చెంతకు చేరాను
Verse
మనుష్యుల నమ్ముకొని మభ్యపడ్డాను
సత్యవంతుడా ఆశ్రయుడవని
నీ చెంతకు చేరాను

Related Tags

FaithJesusTrust