Verse
నిను పోలి నేను
చీకటిలో నుండి వెలుగునకు
నన్ను నడిపిన దేవా‖ 2x ‖
నా జీవితానిని వెలిగించిన
నా బ్రతుకును తేటపరిచిన‖ 2x ‖
Chorus
నన్ను నీవు రక్షించితివయ్యా
నీ కృప చేత నే బ్రతికితినయ్యా
నన్ను నీవు కాపాడితివయ్యా
నీ దయతో నన్ను దీవించితివయ్యా
యేసయ్యా నా యేసయ్యా
నీవే నా బలము యేసయ్యా
యేసయ్యా నా యేసయ్యా
నీవే నా సర్వము యేసయ్యా
Verse
నిను పోలి నేను జీవింతునయ్యా
నీ ఆత్మ దయచేయుమా
నిను పోలి నేను నడతునయ్యా
నీ కాపుదలనీయుమా
Verse
కనికరమే లేని ఈ లోకంలో
కన్నీటితో నేనుంటినయ్యా‖ 2x ‖
నీ ప్రేమతో నను ఆదరించిన
నా హృదయము తృప్తిపరచిన‖ 2x నన్ను నీవు ‖
Verse
నిను పోలి నేను జీవింతునయ్యా
నీ ఆత్మ దయచేయుమా
నిను పోలి నేను నడతునయ్యా
నీ కాపుదలనీయుమా‖ 2x ‖