Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Ninu Polina Vaarevaru

నిను పోలిన వారెవరూ

Ninu Polina Vaarevaru

Lyricist: Benny Joshua
Verse 1
నిను పోలిన వారెవరూ – మేలు చేయు దేవుడవు
నిన్నే నే నమ్మితిన్ నా దేవా‖ 2x ‖
నిన్నే నా జీవితమునకు ఆధారము చేసికొంటిని
నీవు లేని జీవితమంతా వ్యర్ధముగా పోవునయ్య‖ 2x ‖
ఎల్ షడ్డాయ్ ఆరాధన – ఎలోహిం ఆరాధన
అడోనాయ్ ఆరాధన – యేషువా ఆరాధన‖ 2x ‖
Verse
కృంగియున్న నన్ను చూచి
కన్నీటిని తుడిచితివయ్య
కంటి పాప వలే కాచి
కరుణతో నడిపితివయ్య‖ 2x ఎల్ షడ్డాయ్ ‖
Verse
మరణపు మార్గమందు
నడిచిన వేళయందు
వైద్యునిగా వచ్చి నాకు
మరో జన్మనిచ్చితివయ్య‖ 2x ఎల్ షడ్డాయ్ ‖

Related Tags

WorshipDevotion