Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Nirantaram Neetone Jeevinchalane Asha Nannila

నిరంతరం నీతోనే జీవించాలనే ఆశ నన్నిల

Nirantaram Neetone Jeevinchalane Asha Nannila

Verse
నిరంతరం నీతోనే జీవించాలనే ఆశ నన్నిల బ్రతికించుచున్నది
నాప్రాణేశ్వరా యేసయ్యా నా సర్వస్వమా. . .యేసయ్యా
Verse
చీకటిలో నేనున్నప్పుడు నీ వెలుగు నాపై ఉదయించెను
నీలోనే నేను వెలగాలని నీ మహిమ నాలో నిలవాలని‖ 2x ‖
పరిశుద్ధాత్మ అభిషేకముతో నన్ను నింపుచున్నావునీ రాకడకై
Verse
నీ రూపము నేను కోల్పోయినా నీ రక్తముతో కడిగితివి
నీతోనే నేను నడవాలని నీ వలెనే నేను మారాలని‖ 2x ‖
పరిశుద్ధాత్మ వరములతో అలంకరించుచున్నావు నీరాకడకై
Verse
తొలకరి వర్షపు జల్లులలో నీ పొలములోనే నాటితివి
నీలోనే చిగురించాలని నీలోనే పుష్పించాలని‖ 2x ‖
పరిశుద్ధాత్మ వర్షముతో సిద్ద పరచుచున్నావు నీరాకడకై

Related Tags

DevotionalJesusHoly Spirit