Verse
నిరంతరం నీతోనే జీవించాలనే
ఆశ నన్నిల బ్రతికించుచున్నది‖ 2x ‖
నా ప్రాణేశ్వరా యేసయ్యా
నా సర్వస్వమా యేసయ్యా‖ నిరంతరం ‖
Verse
చీకటిలో నేనున్నప్పుడు
నీ వెలుగు నాపై ఉదయించెను‖ 2x ‖
నీలోనే నేను వెలగాలని
నీ మహిమ నాలో నిలవాలని‖ 2x ‖
పరిశుద్ధాత్మ అభిషేకముతో
నన్ను నింపుచున్నావు నీ రాకడకై‖ నిరంతరం ‖
Verse
నీ రూపము నేను కోల్పయినా
నీ రక్తముతో కడిగితివి‖ 2x ‖
నీతోనే నేను నడవాలని
నీ వలెనే నేను మారాలని‖ 2x ‖
పరిశుద్ధాత్మ వరములతో
అలంకరించుచున్నావు నీ రాకడకై‖ నిరంతరం ‖
Verse
తొలకరి వర్షపు జల్లులలో
నీ పొలములోని నాటితివి‖ 2x ‖
నీలోనే చిగురించాలని
నీలోనే పుష్పించాలని‖ 2x ‖
పరిశుద్ధాత్మ వర్షముతో
సిద్ధపరచుచున్నావు నీ రాకడకై‖ నిరంతరం ‖