Verse
నిరంతరమైన నీ కృపలో
నే పొందుచున్న ఆనందమే అది
అవధులు లేని ఆనందమే అది
శాశ్వతమైన ఆనందమే‖ 2x నిరంతరమైన ‖
Verse
అర్హతే లేని నాకు అందలము నిచ్చినావు
అపవాదినెదిరించుటకు అధికారమిచ్చినావు‖ 2x ‖
నా శక్తి కాదు దేవా – నీ ఆత్మ చేతనే
నీ ఘన కార్యములు వర్ణింప శక్యమే‖ 2x నిరంతరమైన ‖
Verse
బలహీనుడైన నన్ను బలవంతుని చేసినావు
బలమైన కార్యములను బహుగా చేయించినావు‖ 2x ‖
నా శక్తి కాదు దేవా – నీ ఆత్మ చేతనే
నీ ఘన కార్యములు వర్ణింప శక్యమే‖ 2x నిరంతరమైన ‖
Verse
మహిమా ప్రభావము నీకే చెల్లింతు మహిమోన్నతుడా
మరణమైన నిన్ను విడువను నా పరుగు ముగిసేదాకా‖ 2x ‖
నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే
చావైతే అది ఎంతో మేలే‖ 2x నిరంతరమైన ‖