Verse
నిరతము స్తుతియించుము ఓ మనసా
క్రీస్తేసుని స్తుతించు‖ 2x ‖
బాధలను తీర్చేటి ఆ స్తోత్రార్హుని
కష్టాలు తొలగించే ఆ కరుణశీలుని‖ 2x ‖
మరువక స్తుతియించుము ఓ మనసా
జయగీతముతో స్తుతించు‖ నిరతము ‖
Verse
వేదనలో విడిపించే ఆ దేవ దేవుని స్తుతియించుము
ఆపదలో ఆదుకొనే ఆరాధ్య దైవమునే స్తుతియించుము‖ 2x ‖
నిన్నిలలో ఓదార్చి తన కృపలో బలపరచే‖ 2x ‖
ఆ నిజ స్నేహితుని
కృతజ్ఞత కలిగి స్తుతియించుము –‖ 2x నిరతము ‖
Verse
అన్ని సమయాలలో చాలిన దేవుని స్తుతియించుము
పేరు జీవ గ్రంథములో వ్రాసిన గొర్రెపిల్లని స్తుతియించుము‖ 2x ‖
నీ భారం తొలగించి
తన కృపలో ఆదరించే‖ 2x ‖
నీ ఆత్మ కాపరియైన
పరిశుద్ధాత్ముని స్తుతియించుము –‖ 2x నిరతము ‖