Verse
నిర్మింపబడితిమి మనము దైవగృహముగా
తన కృపచే స్థిరపరచబడితిమి
Verse
కార్చెను యేసు రక్తము మనకై - కూర్చెను సంఘముగా
కృతజ్ఞతలు చెల్లించెదము - మనప్రభు యేసునకే
Verse
పరిశుద్ధుల సహవాసమునిచ్చి పరలోకమునిచ్చే
పూజనీయుని పూజించెదము - మనసార మనము
Verse
పరదేశులమై యున్న మనల - తన ఇంటికి జేర్చె
ప్రాపుగ మనము ప్రస్తుతింతుము - భక్తపాలకుని
Verse
తన కార్యమును మనలో జేసి - తన సేవకు పిలిచె
తనివి తీరగ స్తుతులర్పింతము - వినయముగా మనము
Verse
సంఘంబునకు శిరస్సైయున్న శ్రీ యేసు ప్రభునే
సర్వకాలము జయశబ్దముతో - సన్నుతించెదము