Verse
నిశ్చయముగ నిన్ను దీవించెదను‖ 2x ‖
నిశ్చయముగ నిన్ను వృద్ధి పొందింతున్‖ 2x ‖
Verse
ప్రత్యక్షమై పలికెనుగ ప్రభువు - సర్వశక్తిగల యెహోవాను నేను
నా సన్నిధిన్ నిర్దోషిగా నడచిన - నీతో నిబంధన నియమింతును
Verse
నీ సంతానమును దీవించి - నిన్ను ఫలియింప జేసెదను
నీలో నుండి జనములు వచ్చును - నీతో నిబంధన స్థిరపరతున్
Verse
యుగయుగములు నీకు దేవుడను - కనాను దేశము నీకొసగెదను
నిత్యస్వాస్థ్యమును నీ కొసగెదను - నీలో మహిమ నే పొందెదను
Verse
గొప్ప జనముగా జేసెదనిన్ను - నిశ్చయముగా ఆశీర్వదింతున్
నీనామమును గొప్ప జేసెదను - ఆశీర్వాదముగ జేసెదను
Verse
నిన్నాశీర్వదించువారిని - నేను ఆశీర్వదించెదను
దూషించువారిని నే శపించెదను - నీ ద్వారా దీవింపబడెదరు