Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Nishchalamainadhi Yaesu Raajyamu Prakaashimchae Raajyamu

నిశ్చలమైనది యేసు రాజ్యము ప్రకాశించే రాజ్యము

Nishchalamainadhi Yaesu Raajyamu Prakaashimchae Raajyamu

Verse
నిశ్చలమైనది యేసు రాజ్యము ప్రకాశించే రాజ్యము
యుగయుగములు నిలుచును ప్రభుని రాజ్యము
Verse
క్రీస్తు రాజ్య సింహాసనమెంతో గొప్పది
కనకంబునకన్న బహుప్రకాశించును
దానిచుట్టు దేవుని మహిమ యుండును
దీక్షతోడ జయించెడువారే పొందెదరు
Verse
నాశనము లేనిది యేసు రాజ్యము
నిత్యుడగు తండ్రి దాని స్థిరము జేసెను
ప్రభుని రాజ్యము యెంతో అనంతమైనది
పరిపాలించు తానే తరతరంబులు
Verse
తన రాజ్యమహిమకు మిమ్ము పిలిచెను
వినయముగా నీతి భక్తికలిగి నిలువుడి
కడవరకు విశ్వాసము కలిగియుండిన
క్రీస్తుయేసు మీకు నీతి మకుటమిచ్చును
Verse
యేసురక్తమందు యెవరు కడుగబడెదరో
వారే హృదయశుద్ధిని పొందెదరిలలో
పరలోక రాజ్యములో ప్రవేశింతురు
ప్రవిమలుని ముఖముజూచి సంతసింతురు
Verse
భూలోక రాజ్యములు అంతరించును
ప్రభుయేసు రాజ్యము నిలచు స్థిరముగా
నీతి సమాధానములతో దేవుడేలును
నేడే చేరవా నీవు ఆ రాజ్యములో?

Related Tags

JesusEternityRighteousnessKingdom