Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Nithya Jeevapu Raajyamulo

నిత్య జీవపు రాజ్యములో

Nithya Jeevapu Raajyamulo

Verse
నిత్య జీవపు రాజ్యములో
సత్య దేవుని సన్నిధిలో‖ 2x ‖
నిత్యం యేసుని స్నేహముతో
నిత్యమానందమానందమే‖ 2x ‖
Verse
వ్యాధి భాధలు లేవచ్చట
ఆకల్దప్పులు లేవచ్చట‖ 2x ‖
మన దీపము క్రీస్తేలే
ఇక జీవితం వెలుగేలే‖ 2x నిత్య ‖
Verse
కడు తెల్లని వస్త్రముతో
పరి తేజో వాసులతో‖ 2x ‖
రాజ్యమునేలుదుములే
యాజకులము మనమేలే‖ 2x నిత్య ‖
Verse
ప్రతి భాష్పబిందువును
ప్రభు యేసే తుడుచునులే‖ 2x ‖
ఇక దుఖము లేదులే
మన బ్రతుకే నూతనమే‖ 2x నిత్య ‖
Verse
పరిశుద్ధ జనములతో
పరిశుద్ధ దూతలతో‖ 2x ‖
హల్లెలూయా గానాలతో
వెంబడింతుము యేసునితో‖ 2x నిత్య ‖

Related Tags

WorshipHeavenEternity