Chorus
నిత్యుడా - నీ సన్నిధి నిండుగా నా తోడూ
నిత్యముంచి నన్ను నడిపించుమా - నడిపించుమా‖ 2x ‖
Verse
నీ కుడి హస్తం - హత్తుకొని యున్నది
నీ ఎడమ చేయి నా - తలక్రిందనున్నది‖ 2x ‖
నీ కౌగిలిలోనే - నిత్యం నిలుపుమా‖ 2x ‖
Verse
నీ సన్నిధిలో - నా హృదయమును
నీళ్ళవలే - కుమ్మరించునట్లు‖ 2x ‖
నీ పాదపీఠముగా -నన్ను మార్చుమా‖ 2x ‖
Verse
నీ సముఖములో - కాలుచున్న రాళ్ళవలె
నీ మనస్సు నందు - నన్ను తలంచితివా‖ 2x ‖
నీ చిత్తమే నాలో - నేరవేర్చుమా‖ 2x ‖