Chorus
నిత్యుడగు నా తండ్రి నీకే స్తోత్రము
తరతరముల నుండి ఉన్నవాడవు
ఆది అంతము లేని ఆత్మా రూపుడా
ఆత్మతో సత్యముతో అరాధింతును
నిత్యుడగు నా తండ్రి
Verse
భూమి ఆకాశములు గతించినా
మారనే మారని నా యేసయ్యా
నిన్న నేడు ఏకరీతిగా ఉన్నవాడా‖ నిత్యుడగు ‖
Verse
సిలువలో నీవు కార్చిన రుధిరధారలే
నా పాపములకు పరిహారముగా మారెనులే
కొనియాడి పాడి నేను నాట్యం చేసెద‖ నిత్యుడగు ‖
Verse
నూతన యెరూషలేముకై సిద్ధపదెదను
నూతన సృష్టిగ నేను మారెదను
నా తండ్రి యేసయ్యా ఆత్మదేవ స్తోత్రము‖ నిత్యుడగు ‖