Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Nityamu Niluchunadi Devuni Vaakyamu

నిత్యము నిలుచునది దేవుని వాక్యము

Nityamu Niluchunadi Devuni Vaakyamu

Chorus
నిత్యము - నిలుచునది - దేవుని వాక్యము
సత్యమై యున్నది - సర్వము చేయునది‖ 2x ‖
Pre-Chorus
ఆ వాక్యమే యేసు దైవము - ఆదియందు ఉన్న దైవము‖ 2x ‖
అంతమే లేని దైవము
Verse
అంధకారమును - తొలగించు జ్యోతి అది
ప్రతి మనిషిని వెలిగించు - మహిమ వెలుగు అది‖ 2x ‖
వెలిగించును - నడిపించును - త్రోవకు దీపమై‖ 2x ‖
ఆ వెలుగు వాక్యము
Verse
ఎండిన ఎడారిలో - నీటి ఊటవంటిది
వడిగా ప్రవహించు - జీవనదియే అది
దప్పిగొనిన - ప్రతి జీవి - దప్పిక తీర్చునది
ఆ జీవ జలవాక్యము
Verse
అపవాదిని అణచివేసె - ఆత్మఖడ్గమది
రెండంచులు వాడీగలదై - వధించును వైరులను
ఓడించును - విడిపించును - తోడై ఎల్లప్పుడు
ఆ శక్తిగల వాక్యము
Verse
పోరాడుము యేసుకై - మంచి సైనికునిగా
శ్రమలను భరించుము - వాక్యములో బలమొంది
తన ఐశ్వర్యములో - తీర్చును - నీ ప్రతి అవసరము
ఆ దేవాది దేవుడు
Verse
నిత్యుడగు దేవుడు - త్వరగా వచ్చుచున్నాడు
జయించు వారినెల్ల - తనతో కొనిపోవును
తన వాక్యమునందు వర్ధిల్లుచు - విజయుడవై యుండుము
ప్రభుకొరకై కనిపెట్టుము
హల్లెలూయా హల్లెలూయ - హల్లెలూయా హల్లెలూయ‖ 2x ‖

Related Tags

BibleWord Of GodSpiritual Strength