Chorus
నీవే నన్నుకోరుకొన్నావు నీవే నన్ను చేరుకొన్నావు
నీవే నన్ను విడిపించావు నీవే నన్ను విడువనన్నావు
ఎంతప్రేమ యేసయ్యా వింత ప్రేమ నీదయ్యా‖ 2x ‖
Verse
నీ అరచేతిలో నన్ను చెక్కుకొన్నావు నీ కృపలో నన్ను ఎన్నుకొన్నావు
నీ రాజ్యములో నను దాచివుంచావు నీ నామములో నను రక్షించావు
ఎంతప్రేమ యేసయ్యా వింత ప్రేమ నీదయ్యా‖ 2x ‖
Verse
నీ వాక్యముతో నను సుద్ధిచేసావు నీ రక్తముతో నను కడిగివేసావు
నీ వాగ్ధానముతో నన్ను స్థిరపరచావు నీ ఆత్మతో నన్ను నింపివేసావు
ఎంతప్రేమ యేసయ్యా వింత ప్రేమ నీదయ్యా‖ 2x ‖