Verse
Reference: యెన్నాళ్ళ మట్టుకు మీరు రెండు తలంపుల మధ్య తడబడుచుందురు? 1 రాజులు 18:31
Verse
పల్లవి: నీవెన్నాళ్ళు రెండు తలంపులతో - కుంటి కుంటి నడిచెద వీవు
యెహోవాయే నీ దేవుడా? లేకవేరే దేవతలున్నారా?
Verse
మనం తీర్మానించెదమిపుడే - మననోట వంచన లేకుండా
మరుగైనా పాపములన్నిటిన్ - హృదయమునుండి తొలగించెదం
Verse
మారు మనస్సు పొందెదమిప్పుడే - జీవితమోసములనుండి
పరిశుద్ధులమై నిర్దోషులుగా - ప్రభుదినమందు కనపడెదం
Verse
అపవాదికి చోటివ్వక - బహుజాగ్రతతో నుండెదం
మనుష్యులను సంతోషపెట్టక - దైవ చిత్తములో నిలిచెదము
Verse
నేను నా యింటి వారలము - యెహోవానే సేవించెదము
నీవెవరిని సేవించెదవో - ఈ దినమే తీర్మానించుకో
Verse
పడిపోయిన నీ బలిపీఠమున్ - సరిచేయుటకు నీవు సిద్ధమా
ఇశ్రాయేలు దేవుని వేడిన - అగ్ని మూలముగ బదులిచ్చును
Verse
ఇంత వరకు నిన్ను నడిపిన - ఎబినేజరైన నీ దేవుని
నీవు మరచి జీవించినచో - నీకు నెమ్మదియే ఉండదు
Verse
ద్వంద్వ జీవిత మార్గములు - ఎరుగుదువా అస్థిరములని
పూర్ణమనస్సుతో ప్రభున్ వెదకిన - పూర్ణ మహిమతో నిండెదవు