Chorus
నూతన ఆకాశమును భూమి నేను చూచితి
అందుండె శాంతి ఆనందజ్యోతి మహిమ తేజముల్
ముందున్న భూమి యాకాశము లదృశ్యమాయెను
సముద్ర మికను లేదు అందున్న వెల్లను
Verse
పరలోక రాజ్యపట్టణమెంతో యద్భుతము
గొఱ్ఱెపిల్ల కాంతితోడ ద్దని కాంతి యెంతయో
సురక్షితంబు చేయబడెను ప్రాకారంబుతో
గొఱ్ఱెపిల్లకు యుగములందు స్తుతియారాధన
Verse
పరిశుద్ధ యెరూషలెము పరలోకమునుండి
దేవుని యొద్దనుండి దిగుట నేను చూచితి
భర్తకొరకు అలంకరింపబడియున్న
పెండ్లికుమార్తెవలెనె సిద్ధమై యుండెను
Verse
సింహాసనము నుండి యొక స్వరము వింటిని
దేవుని నివాసము మనుజులలో నున్నది
ఆయన వారితోడనే ఎల్లప్పుడుండును
ఆయన వారి దేవుడు వారాయన ప్రజలు
Verse
దేవుడు వారి కండ్లనీళ్ళు తుడిచివేయును
దుఃఖంబు మరణములు యింకెన్నడుండవు
ఏడ్పు బాధ శాపము లిక నెన్నడుండవు
రాత్రి లేదిక గొఱ్ఱెపిల్ల దీపంబాయెగా
Verse
సింహాసనాసీనుండు తానే మరల చెప్పెను
ఇదిగో సమస్తమును నూతనమాయెను
పాతసంగతులెల్లను గతించి పోయెను
గతించినవి రావు మరల జ్ఞాపకమునకు
Verse
పట్టణమునకు ఎత్తైన ప్రాకారమున్నది
చుట్టు పండ్రెండు గుమ్మములు దానికున్నవి
కట్టబడెను ముత్యములతో పునాదులు
చుట్టబడెను సూర్యకాంత సువర్ణములతో
Verse
పట్టణపు పునాదులు ప్రశస్తమైనవి
సూర్యకాంతము నీలము యమున పచ్చయు
వైఢూర్యకెంపు స్వర్ణరత్న గోమేధికము
పుష్య పద్మరాగ స్వర్ణసునీయ సుగంధము
Verse
జయించువారు ధన్యులు యేలుదురెన్నడు
ధరించి తెల్ల వస్త్రములు సంతసింతురు
ప్రభువు వారి - దేవుడై యుండు నిరంతము
వారసులై సర్వము స్వతంత్రించు కొందురు
Verse
ప్రభుని భక్తులారా మీరు సిద్ధపడుడి
అద్భుత రాజ్యమందు నుండ యాశపడుడి
గొఱ్ఱెపిల్ల గ్రంథమున పేరున్న వారలు
ఘనంబుగ పరంబున ప్రవేశించెదరు