Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Noothana Geethamu Ne Paadedha Manoharudaa Yesayyaa

నూతన గీతము నే పాడెదా మనోహరుడా యేసయ్యా

Noothana Geethamu Ne Paadedha Manoharudaa Yesayyaa

Lyricist: Hosanna Ministries
Verse
నూతన గీతము నే పాడెదా – మనోహరుడా యేసయ్యా
నీవు చూపిన ప్రేమను నే మరువను – ఏస్థితిలోనైననూ సమర్పణతో
సేవించెదను నిన్నే – సజీవుడనై ఆరాధించెద నిన్నే
కొలువుచేసి ప్రేమించినావు – కోరదగినది ఏముంది
నాలో స్వార్ధ మెరుగని సాత్వీకుడా – నీకు సాటెవ్వరూ
నీవే నా ప్రాణము – నిను వీడి నేనుండలేను
కడలి తీరం కనబడనివేళ – కడలి కెరటాలు వేధించువేళ
కరుణమూర్తిగా దిగివచ్చినా – నీకు సాటెవ్వరూ
నీవేనా ధైర్యమూ – నీ కృపయే ఆధారమూ
మేఘములలో నీటిని దాచి – సంద్రములలో మార్గము చూపి
మంటిఘటములో మహిమాత్మ నింపిన – నీకు సాటెవ్వరూ
నీవేనా విజయమూ – నీ మహిమయే నా గమ్యమూ

Related Tags

WorshipDevotionalSurrender