Chorus
నూతన గీతము పాడెదను - నా ప్రియ యేసుని -
హల్లెలూయా ||3|| ఆమేన్‖ 3x నూతనగీతము ‖
Verse
ఆత్మతోనే పాడెదను ఆర్భటించి పాడెదను -
అభినయించి పాడెదను
అనుభవించి పాడెదను -
అనుదినము పాడెదను -
అందరిలోనె పాడెదను‖ నూతనగీతము ‖
Verse
యేసు నా మంచి కాపరి -
యేసే నా గొప్ప కాపరి -
యేసే నా ప్రధాన కాపరి
యేసే నా ఆత్మ, కాపరి,
యేసే నాకున్న కాపరి
యేసే నాలో ఉన్న కాపరి‖ నూతనగీతము ‖
Verse
శత్రుసేనలు ఎదురైన -
దుష్టులంత ఒక్కటైన -
అజేయుడేసుని చేరెదము
విజయగీతము పాడెదము -
ద్వజమునెత్తి పాడెదము -
భజన చేయుచు పాడెదము‖ నూతనగీతము ‖