Verse
నూతన గీతము పాడెదను నా ప్రియుడేసునిలో
హల్లెలూయ - హల్లెలూయ - హల్లెలూయ ఆమెన్
Verse
ఆత్మతో నే పాడెదను - ఆర్భటించి పాడెదను - అభినయించి పాడెదను
అనుభవించి పాడెదను - అనుదినము నే పాడెదను - అందరిలో నే పాడెదను‖ నూతన ‖
Verse
యేసే నా మంచి కాపరి - యేసే నా గొప్ప కాపరి - యేసే నా ప్రధాన కాపరి
యేసే నా ఆత్మ కాపరి - యేసే నన్ను కొన్న కాపరి - యేసే నాలో ఉన్న కాపరి‖ నూతన ‖
Verse
శత్రు సేనలు ఎదురైనా - దుష్టులంతా ఒక్కటైనా - అజేయుడేసుని చేరెదము
విజయగీతము పాడెదము - ద్వజము నెత్తి సాగెదము - భజన చేయుచు పాడెదము