Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Noothana Kriyalu Cheyuchunnaavani Neevu Selaviyyagaa

నూతన క్రియలు చేయుచున్నావని నీవు సెలవియ్యగా

Noothana Kriyalu Cheyuchunnaavani Neevu Selaviyyagaa

Lyricist: Pastor Praveen
Verse
నూతన క్రియలు చేయుచున్నావని నీవు సెలవియ్యగా
నూతన మనసుతో నను నింపెదవని నీవు సెలవియ్యగా
నా అరణ్యరోధనయే ఉల్లాసముగా మారెనె
నా యెడారి జీవితమే సుఖసౌక్యముగా మారెనె
హల్లెలూయ గానాలతో హోసన్న గీతాలతో‖ 2x ‖
నిన్ను ఆరాధింతును ఘనపరతును నిన్ను కీర్తింతును‖ 2x నూతన ‖
Verse
ఊహకు అందనీ కార్యములు జరిగించువాడవు
అందనీ శిఖరము నన్ను ఎక్కించువాడవు
నిన్ను ప్రేమించు వారిని దీవించెదవు సేవించు వారిని ఘనపరచెదవు‖ 2x ‖
నీ ప్రేమ వర్ణించలేనయా – నీ కృప వివరించలేనయా‖ 2x హల్లెలూయ ‖
Verse
నిందకు ఘనతను మరల ఇచ్చువాడవు
కోల్పోయిన దీవెనలు నూరంతలుగా దయచేతువు
మాటయిచ్చి తప్పని వాడవు – వాగ్దానమును స్థిరపరచు వాడవు‖ 2x ‖
నీ సంకల్పము గ్రహింతును – నీ చిత్తమునే జరిగింతును‖ 2x హల్లెలూయ ‖
Verse
తండ్రితో ఐక్యమై అతిశయించు భాగ్యముతో
క్రీస్తులో నిలబడి వెలుగుగా ప్రకాశింతును
పరిశుద్ధాత్మతో నే సాగెదను – పరిశుద్దులతో నేనుండెదను‖ 2x ‖
నాకెంతో భాగ్యమయా – నాకెంతో ధన్యతయా‖ 2x హల్లెలూయ ‖

Related Tags

PraiseWorshipThanksgiving