Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Noothana Parachumu Devaa

నూతన పరచుము దేవా

Noothana Parachumu Devaa

Lyricist: Glory Rangaraju
Verse
నూతన పరచుము దేవా
నీ కార్యములు నా యెడల‖ 2x ‖
సంవత్సరాలెన్నో జరుగుచున్నను
నూతనపరచుము నా సమస్తము‖ 2x ‖
పాతవి గతించిపోవును – సమస్తం నూతనమగును
నీలో ఉత్సహించుచు – నీకై ఎదురు చూతును‖ నూతన ‖
Verse
శాశ్వతమైనది నీదు ప్రేమ
ఎన్నడైన మారనిది నీదు ప్రేమ‖ 2x ‖
దినములు గడచినా సంవత్సరాలెన్ని దొర్లినా
నా యెడ నీదు ప్రేమ నిత్యం నూతనమే‖ 2x Paathavi ‖
Verse
ప్రతి ఉదయం నీ వాత్సల్యముతో
నన్ను ఎదుర్కొందువు నీదు కరుణతో‖ 2x ‖
తరములలో ఇలా సంతోషకారణముగా
నన్నిల చేసినావు నీకే స్తోత్రము‖ 2x Paathavi ‖

Related Tags

PraiseWorshipRenewal