Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Noothana Samvathsaram

నూతన సంవత్సరం

Noothana Samvathsaram

Lyricist: Songs Of Zion
Verse
నూతన సంవత్సరం దయచేసిన దేవా
నీకే స్తోత్రములు అద్వితీయ ప్రభువా‖ 2x ‖
ఆశ్చర్యకరుడవు ఆది సంభూతుడవు‖ 2x ‖
అద్భుతకరుడవు అల్ఫా ఓమెగవు‖ 2x నూతన ‖
Verse
పాపాంధకారమునకు బానిసనై యున్నప్పుడు
శాపముతో నేను హీనుడనై యున్నప్పుడు
చేతులు చాచి నన్ను లేవనెత్తిన దేవా
ప్రేమతో పిలిచి నన్ను ఆదరించిన ప్రభువా
నీ ప్రేమ పిలుపుకు నే ఘనుడనైతిని
నీ స్పర్శ తాకిడికి ఆత్మ పూర్ణుడైతిని‖ నూతన ‖
Verse
కడవరి దినాలలో కంట నీరు పెడుతుండగా
కష్టాలతో నేను సతమతమౌతుండగా
నీ వాక్య వెలుగులో నడిపించిన నా ప్రభువా
ఏ దిక్కు లేని నాకు దారి చూపిన తండ్రి
నీ జాలి హృదయమునకు దాసుడ నేనైతిని
నీ వాక్య జ్ఞానమునకు పరిచారకుడనైతిని‖ నూతన ‖

Related Tags

PraiseThanksgivingNew Year