Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Noothana Yerushalem Digi Vachuchunnadhi

నూతన యెరుషలేమ్ దిగి వచ్చుచున్నది

Noothana Yerushalem Digi Vachuchunnadhi

Lyricist: Bro Yesanna
Chorus
నూతన యెరుషలేమ్ - దిగి వచ్చుచున్నది
పెండ్లికుమార్తె వలె - మహిమతో నిండి
స్వర్గమునందున్న- దేవుని యొద్ద నుండి
నూతన యెరుషలేమ్ - దిగి వచ్చుచున్నది
పెండ్లికుమార్తె వలె - మహిమతో నిండి
Verse
శోభ కలిగిన - ఆ దివ్య నగరము
వర్ణింప శక్యము - కానిదియే‖ 2x ‖
బహు సహస్రముల - సూర్యుని కంటె‖ 2x ‖
ప్రజ్వలించుచున్నది - మహిమవలెను
Chorus
నూతన యెరుషలేమ్ - దిగి వచ్చుచున్నది
పెండ్లికుమార్తె వలె - మహిమతో నిండి
Verse
పరిపూర్ణమైన -సౌందర్యమును
పృథ్వికి - ఆనందముగాను‖ 2x ‖
భూరాజులందరు - మహిమ తెచ్చెడి‖ 2x ‖
మహిమగల నగరము - ఇదియే
Chorus
నూతన యెరుషలేమ్ - దిగి వచ్చుచున్నది
పెండ్లికుమార్తె వలె - మహిమతో నిండి
Verse
ధగధగ మెరయు - సూర్యకాంతం వలె
జ్వలించుచున్న- దైవనగరమందు‖ 2x ‖
నీతిమంతులే - సూర్యునివలెను‖ 2x ‖
నిత్య నిత్యముగా - ప్రకాశించుచుందురు
Chorus
నూతన యెరుషలేమ్ - దిగి వచ్చుచున్నది
పెండ్లికుమార్తె వలె - మహిమతో నిండి
స్వర్గమునందున్న- దేవుని యొద్ద నుండి
నూతన యెరుషలేమ్ - దిగి వచ్చుచున్నది
పెండ్లికుమార్తె వలె - మహిమతో నిండి

Related Tags

GloryHeavenly CityJerusalem