Chorus
నూతనమైన యెరుషలేము పరిశుద్ధ పట్టణము
దానికి మనలను పాత్రుల జేసిన
మన ప్రభు యేసుకే వందన స్తుతులు
Verse
సమాధాన సంతోషము పరిపూర్ణముగా నిండియున్నది
శాంతి దాత యేసు ప్రభువు యేలుచున్న రాజ్యములో
మనలను పాలివారిగ జేసిన రారాజునకే స్తోత్రములు
Verse
మన పాపములను క్షమియించెనుగా కల్వరిసిలువ రక్తము ద్వారా
తన పరిశుద్ధతయందు మనల జేసె
మహిమాపూర్ణుడ మాదేవ మనసార నిను పాడెదను
Verse
పరిశుద్ధ పట్టణము యెంతో సౌందర్యము కలిగియున్నది
భర్త కొరకు సిద్ధపడిన పెండ్లి కుమార్తెగా నుండెనుగా
తన వధువుగా జేసిన ప్రభుకే స్తుతిచెల్లించెదము నిరతం
Verse
దేవుడే మనతో నివసించును - కాపురముండును మనతో నిత్యము
దేవుడే మనకు తోడై యుండి - నడుపును మనల పరమునకు
మనలను ప్రేమించిన ప్రభునే ఆరాధించి మ్రొక్కెదము
Verse
మనకన్నుల ప్రతి భాష్పములను తుడిచివేయును మన ప్రభు యేసు
మరణము దుఃఖము వేదనయుండదు పరిశుద్ధ నగరములో
మరణము లోకము సాతానున్ - గెలిచిన ప్రభునే పూజింతుము