Verse
నూతనమైనది నీ వాత్సల్యము – ప్రతి దినము నన్ను దర్శించెను
ఎడబాయనిది నీ కనికరము – నన్నెంతో ప్రేమించెను
తరములు మారుచున్నను – దినములు గడచుచున్నను
నీ ప్రేమలో మార్పు లేదు‖ 2x ‖
సన్నుతించెదను నా యేసయ్యా
సన్నుతించెదను నీ నామము‖ 2x ‖
Verse
గడచిన కాలమంతా – నీ కృప చూపి – ఆదరించినావు
జరగబోయే కాలమంతా – నీ కృపలోన – నన్ను దాచెదవు‖ 2x ‖
విడువని దేవుడవు – ఎడబాయలేదు నన్ను
క్షణమైనా త్రోసివేయవు‖ 2x సన్నుతించెదను ‖
Verse
నా హీన దశలో – నీ ప్రేమ చూపి – పైకి లేపినావు
ఉన్నత స్థలములో – నను నిలువబెట్టి – ధైర్యపరచినావు‖ 2x ‖
మరువని దేవుడవు – నను మరువలేదు నీవు
ఏ సమయమైననూ చేయి విడువవు‖ 2x సన్నుతించెదను ‖
Verse
నీ రెక్కల క్రింద – నను దాచినావు – ఆశ్రయమైనావు
నా దాగు స్థలముగా – నీవుండినావు – సంరక్షించావు‖ 2x ‖
ప్రేమించే దేవుడవు – తృప్తి పరచినావు నన్ను
సమయోచితముగా ఆదరించినావు‖ 2x సన్నుతించెదను ‖