Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Novahu Odane Sanghamulo

నోవహు ఓడనే సంఘములో

Novahu Odane Sanghamulo

Lyricist: Israel
Verse
నోవహు ఓడనే సంఘములో రెండు పక్షులు
నీకు నాకు గురుతుగా ఉన్నాయి‖ 2x ‖
మాట వినిన పావురం – లోబడని కాకియు
ఆ సంఘములో విశ్వాసులైనాయి‖ 2x నోవహు ఓడనే ‖
Verse
గురుతు తెమ్మని నోవహు పంపాడు… తెలివైన కాకిని
దైవ జనుని మాటే మరచి… లోకమును ప్రేమించి…‖ 2x ‖
ఇటు అటు తిరుగుచుండెనా కాకి‖ 2x ‖
సంఘములో ఉన్న నీవు… పాపముపై ఆశతో‖ 2x ‖
ఇటు అటు తిరుగుచున్న భక్తి లేని కాకివా‖ 2x ‖
నీవు కాకివా… పావురానివా‖ 2x నోవహు ఓడనే ‖
Verse
గురుతు తెమ్మని నోవహు పంపాడు… నల్లని పావురమును
ఓడను మరచి పోక… కాలు నిలుప స్థలము లేక…
మరల తిరిగి వచ్చే ఆ పావురము‖ 2x ‖
సంఘములో ఉన్న నీవు… పరిశుద్ధత కాంక్షతో‖ 2x ‖
లోకమునకు వేరుగ ఉన్న భక్తి పావురానివా‖ 2x ‖
పావురానివా… నీవు కాకివా‖ 2x నోవహు ఓడనే ‖
Verse
గురుతు తెమ్మని నోవహు పంపాడు… మరలా ఆ పావురమును
ఆజ్ఞను మరచి పోక… ఒలీవాకు గురుతుగా తెచ్చె…
బాధ్యత కలిగిన ఆ పావురము‖ 2x ‖
సంఘములో ఉన్న నీవు… ఆత్మల భారముతో‖ 2x ‖
ఆత్మలను సంపాదించే భక్తి పావురానివా‖ 2x ‖
పావురానివా… నీవు కాకివా‖ 2x ‖

Related Tags

FaithRepentanceChristian Life