Verse
నృపా విమోచకా ప్రభూ - వేలాది నోళ్ల నీ
గృపా జయప్రభావముల్ - నుతింతు నెంతయున్
Verse
కృపాధికార దేవ నీ సాయంబు జేయుమా
భవత్ర్వభావ కీర్తులన్ - జాటంగ నెల్లడన్
Verse
భయంబు చింతబావును - హర్షంబు పాపికి
సౌఖ్యంబు జీవశాంతులు - నీనామ మిచ్చును
Verse
విముక్తి జేయు ఖైదిని - పాపంబు బావును
పాపాత్ము శుద్ధిచేయును శ్రీ యేసు రక్తము
Verse
జనాళి పాపు లెల్లరు - శ్రీ యేసున్ నమ్ముడి
కృపా విముక్తులందరు - నంపూర్ణ భక్తితో
Verse
అర్పించె యేసు ప్రాణమున్ - నరాళిగావను
యజ్ఞంబు దేవ గొఱ్ఱెపై - నఘంబు వేయుడి
Verse
సత్కీర్తి స్తోత్ర ప్రేమల - నభావ భూమిని
సర్వత్ర దేవుడొందుగా - సద్భక్తవాళిచే