Verse
నృపా! విమోచకా! ప్రభూ వేలాది నోళ్ల నీ
కృపా జయప్రభావముల్ నుతింతు నెంతయున్.
Verse
కృపాధికార! దేవ! నీ సాయంబు జేయుమా
భవత్ర్పభావ కీర్తులన్ జాటంగ నెల్లెడన్.
Verse
భయంబు చింతఁ బాపును హర్షంబు పాపికి
సౌఖ్యంబు జీవశాంతులు నీ నామ మిచ్చును.
Verse
విముక్తి జేయు ఖైదిని పాపంబు బాపును
పాపాత్ము శుద్ధుజేఁయును శ్రీయేసు రక్తము.
Verse
జనాళి! పాపు లెల్లరు! శ్రీయేసున్ నమ్ముఁడి
కృపావిముక్తులందుఁడి సంపూర్ణ భక్తితో.
Verse
అర్పించె యేసు ప్రాణమున్ నరాళిఁగావను;
యజ్ఙంపు దేవు గొఱ్ఱెపై నఘంబు వేయురడి.
Verse
సత్కీర్తి స్తోత్ర ప్తేమల నభాన భూమిని
సర్వత్ర దేవుఁడొందుగా సద్భక్త పాళిచే.