Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Nuthanamaina krupa nava nuthanamaina krupa

నూతనమైన కృప నవ నూతనమైన కృప

Nuthanamaina krupa nava nuthanamaina krupa

Lyricist: John Wesley
Verse
నూతనమైన కృప – నవ నూతనమైన కృప
శాశ్వతమైన కృప – బహు ఉన్నతమైన కృప
నిరంతరం నాపై చూపిన – నిత్యతేజుడా యేసయ్యా
నీవాత్సల్యమే నాపై చూపించిన నీ ప్రేమను వివరించనా!
నను నీ కోసమే ఇల బ్రతికించిన జీవాధిపతి నీవయ్యా
ఇదేకదా నీలో పరవశం మరువలేని తియ్యని జ్ఞాపకం
Verse
నా క్రయధనముకై రుధిరము కాంతివి
ఫలవంతములైన తోటగా మార్చితివి
ఫలితముకొరకైన శోధన కలిగినను
ప్రతిఫలముగ నాకు ఘనతను నియమించి ఆశ్చర్యకరమైన ఆదరణ కలిగించి
అన్నివేళలయందు ఆశ్రయమైనావు
ఎంతగా కీర్తించినా – నీరుణమే నే తీర్చగలనా
ఇదేకదా నీలో పరవశం – మరువలేని తియ్యని జ్ఞాపకం
Verse
నీ వశమైయున్న ప్రాణాత్మదేహమును
పరిశుద్ధపరచుటయే నీకిష్టమాయెను
పలువేదనలలో నీతో నడిపించి
తలవంచని తెగువ నీలో కలిగించి
మదిలో నిలిచావు – మమతను పంచావు
నా జీవితమంతా నిను కొనియాడెదను
ఎంతగా కీర్తించినా – నీరుణమే నే తీర్చగలనా
ఇదేకదా నీలో పరవశం – మరువలేని తియ్యని జ్ఞాపకం
Verse
సాక్షి సమూహము మేఘమువలెనుండి
నాలో కోరిన ఆశలు నెరవేరగా
వేలాది దూతల ఆనందముచూచి
కృపమహిమైశ్వర్యం నే పొందిన వేళ
మహిమలో నీతోనే నిలిచిన వేళ
మాధుర్య లోకాన నిను చూచిన వేళ
ఎంతగా కీర్తించినా – నీరుణమే నే తీర్చగలనా
ఇదేకదా నీలో పరవశం – మరువలేని తియ్యని జ్ఞాపకం

Related Tags

WorshipDevotionalGrace