Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Nuthi Seyanu Laevae Yo Manasa Nuthin-ja

నుతి సేయను లేవే యో మనసా నుతిఁజ

Nuthi Seyanu Laevae Yo Manasa Nuthin-ja

Lyricist: Vanthagani Paradesi
Chorus
నుతి సేయను లేవే యో మనసా నుతిఁజేయను లేవే క్షితిని దివిని
హితమతిఁ బ్రోచెడి సుతుని జనకుని శుద్ధాత్మునిఁ త్ర్యేకుని‖ నుతి ‖
Verse
సూర్యుని కాంతి సొంపగు పంటలు సుకాలక్షేమముల్ శోభిలు
గేహమున్ ఆర్య సాంగత్యము నైశ్వర్యముల నిల ననుభవింపవె నీవా
యాఢ్యుని పేర్మిని‖ నుతి ‖
Verse
దురితము లందె దుర్గతి నున్న నీ కురుతర ప్రేమను బరమార్థ
మీయను వరపుత్రు నొసఁగఁడె వందనీయుఁడు ప్రభు మరిమరి
మ్రొక్కు మా పరమోపకారిని‖ నుతి ‖
Verse
జీవము జ్ఞానము జీవము నొసంగెడు పావనాత్మను నీకై పంపిన
దేవుడు కేవల దోష స్వ భావము మార్చఁడె సేవ జేయుమ నీవా
పావనమూర్తికి‖ నుతి ‖
Verse
కరములు పదముల్ కనకాదు లన్నియు స్వరమును చిత్తము స్థిరమగు
ప్రేమయు మరి నీదు హృదయము పరమాత్ము సేవకై పరిపూర్ణముగ
నిచ్చి ప్రణుతించు మాయనన్‖ నుతి ‖

Related Tags

PraiseWorship