Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Nuvvevaro Yesu

నువ్వెవరో యేసు

Nuvvevaro Yesu

Lyricist: Swapna Edwards
Verse
ఈ లోకం కన్నా మిన్నగా
నా బంధం కన్నా అండగా
అన్నీ నీవై నిలిచి
నను వెదకి వచ్చితివే
Chorus
నువ్వెవరో యేసు నువ్వెవరో…
నా తల్లి కన్నా నీవే
నా తండ్రి కన్నా నీవే
నా అండ దండ తోడు నీడ నీవై
నన్ను కాచితివే
ఈ లోకం కన్నా మిన్నగా
నా బంధం కన్నా అండగా
అన్నీ నీవై నిలిచి
నను వెదకి వచ్చితివే
Verse
నా తల్లి నను మరచే
నేనెన్నో సార్లు ఏడ్చే
నీవు నన్ను మరువక
నా ప్రక్కన ఉంటివే
నా కన్నుల్లోని నీళ్లు నిను మసక చేసెనే
నా కంటి నీరు తుడిచి నేనున్నానంటివే‖ ఈ లోకం ‖
Verse
నా తండ్రి నను విడచే
నేనొంటరినై నడచే
నీవు నన్ను విడువక
నా చెంత నడచితివే
ఎవరు లేరనే బాధలో నిన్నే కానకపోయే
తుళ్ళిపడిన వెంటనే నన్నాదుకొంటివే
(యేసు) నువ్వేలే నా సర్వం‖ 2x నా తల్లి ‖

Related Tags

DevotionalComfortJesus